
సబ్ టైటిల్ :బాధిత కుటుంబానికి న్యాయం చేసి సాధిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్
జనం న్యూస్, ఆగష్టు 25,అచ్యుతాపురం : ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యుడైన సాధిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజాన సన్యాసినాయుడు తెలిపారు.బిజెపి మండల అధ్యక్షుడు కూండ్రపు నాయుడు బాబు ఆధ్వర్యంలో ఈ ఘటనపై విచారణ జరపాలని కోరుతూ అచ్యుతాపురం ఎస్సై వెంకట్రావుకి వినతి పత్రాన్ని బీజేపీ శ్రేణులు అందించారు.బీజేపీ నేతల ఆరోపణల ప్రకారం, పరిచయం, నమ్మకం, ఆర్థిక లావాదేవీలు, బెదిరింపుల ద్వారా నూకరాజు కుటుంబాన్ని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయని,ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వినతి పత్రంలో కోరారు.ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు సాధిక్ ఖాన్కు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి ఈ ఘటనపై స్పందించి, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.అయితే ‘లవ్ జిహాద్’కు సంబంధించిన బీజేపీ ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉందని, పోలీసులు కేసును అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని పార్టీ పేర్కొందన్నారు. వినతి పత్రం అందించిన వారిలో రాజాన సన్యాసినాయుడు తో పాటు మండల అధ్యక్షుడు కూండ్రపు నాయుడు బాబు, మామిడి సురేష్ కుమార్, పెంటకోట జయ అప్పారావు, తురాయి శ్రీరాములు, బండారు కన్నం నాయుడు కాసుబాబు తదితరులు పాల్గొన్నారు.