

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం ఆగస్టు 28. 08. 2026జరాసంగం మండలం: జహీరాబాద్ నియోజకవర్గంలోని జరాసంగం మండలం ఏడాకులపల్లి ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బాబురావు, బర్ల అంజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. యజ్ఞం సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.బాబురావు, బర్ల అంజన్న మాట్లాడుతూ సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తి, ఆధ్యాత్మికతతో నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ప్రశాంతతను, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, నిర్వాహకులు పాల్గొని యజ్ఞం, ప్రత్యేక పూజలను విజయవంతం చేశారు.