
జనం న్యూస్ఆగస్టు 08: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలోని శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద బహుజన ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 134వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ముదిరాజ్ సంఘం సభ్యులు పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్గట్ల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రెండ్ల రవి, బట్టాపూర్ ఉపసర్పంచ్ ఫో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, బీసీ–ఎస్సీ–ఎస్టీ మండల జేఏసీ అధ్యక్షుడు జూంగల గణేష్, రెండ్ల రాజారెడ్డి, మాజీ అధ్యక్షుడు జూంగల పెద్ద గంగారాం మాట్లాడుతూ.. నాటి తెలంగాణలో దొరలు, పెత్తందారులు, భూస్వాములు, దేశ్ముఖ్ల దోపిడీకి వ్యతిరేకంగా పండుగ సాయన్న పోరాడారని అన్నారు. దోపిడీకి గురైన సంపదను స్వాధీనం చేసుకుని, అన్యాయానికి గురైన పేద ప్రజలకు పంచి పెట్టి వారికి అండగా నిలిచారని కొనియాడారు.పండుగ సాయన్న ముదిరాజ్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇరపట్నం చిన్న గంగారాం, శ్రీనివాస్, రొక్కెడ సంజీవ్, కూరాకుల రమేష్, శ్రీనివాస్ గౌడ్, బాలు, గుర్రం చిరంజీవి, రామ్, లక్ష్మణ్, బుర్కాల ప్రభాకర్, మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.