
జనం న్యూస్ ఆగస్టు12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:వసంత టూల్స్ ట్రస్ట్ అధ్యక్షులు, దానగుణ సంపన్నులు శ్రీ దయానంద రెడ్డి సౌజన్యంతో బుధవారం ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్, ప్రింటర్‌ను అందజేశారు.
ఇప్పటికే పాఠశాలకు క్రీడా దుస్తులతో పాటు ఆట వస్తువులను అందించిన శ్రీ దయానంద రెడ్డి, తాజాగా విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్, ప్రింటర్‌ను అందించడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ, పాఠశాలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్న శ్రీ దయానంద రెడ్డి గారి దానగుణం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన వస్తువులను అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శ్రీ దయానంద రెడ్డి గారు అందించిన పరికరాలను పాఠశాలకు తీసుకువచ్చిన ఆయన ఆప్తులు శ్రీ రజనీష్‌ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది.కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునీరుద్దీన్, విజయ్, రాజనర్సయ్య, రాజేందర్, గంగాధర్, ప్రవీణ్ శర్మ, ట్వింకిల్, గంగా మోహన్, సబిత, సమత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.