

జనం న్యూస్ఆగస్టు 15: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం:80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల నుంచి విద్యార్థులతో గ్రామమంతా ప్రభాతభేరి నిర్వహించారు.అనంతరం పాఠశాల ఆవరణలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కొమరగిరి కృష్ణాచారి, గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు.కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన కళా, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు గ్రామ కమిటీ సౌజన్యంతో బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వీడీసీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు