
జనం న్యూస్ జులై 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కాంటెస్ట్ డ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సూచనలు మేరకు భారత్ నగర్ లోని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ సయ్యద్ అబుదుల్ జాకే ను కలిసిన ఏ.వి.బి పురం ప్రెసిడెంట్ సీమాద్రి, జనసేన నాయకులు, కాలనీ వాసులు తమ కాలనీ లో సుమారు వంద మంది నివసిస్తున్న రోడ్ నంబర్-1 లో డ్రేనేజ్ మరియు వాటర్ సౌకర్యం లేదని అచ్చట నివసిస్తున్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు అని వెంటనే వాటర్ మరియు డ్రైనేజీ సమస్యని పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించారు.వెంటనే స్పందించిన వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ ఏవిబి పురం రోడ్ నంబర్- 11 కి వచ్చి అక్కడ ఇబ్బంది పడుతున్న కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.వారి తక్షణ స్పందనకు ప్రేమ కుమార్, కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, టి. ప్రసాద్,దుర్యోధన,మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.