
జనం న్యూస్ జులై 27 వికారాబాద్ జిల్లా నియోజకవర్గంలోని దోమ మండలంలో తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. మోత్కూరు గ్రామనికి చెందిన జిపిఓ జగదీశ్ కళ్యాణ లక్ష్మీ అప్రూవల్ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.మోత్కూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ఎల్లమ్మ తన కూతురు కవిత వివాహానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి పంచనామా కోసం గ్రామ పంచాయతీ అధికారి జగదీష్‌ను ఆశ్రయించింది.పంచనామా చేయాలంటే రూ. 6,000 లంచం ఇవ్వాల్సిందేనని జీపీఓ డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేని ఎల్లమ్మ. గ్రామస్తుడైన రంగంపల్లి చెన్నయ్యకు విషయం చెప్పగా, ఆయన పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం ఉదయం మోత్కూరు పంచాయతీ కార్యాలయానికి వచ్చిన జీపీఓ జగదీష్‌కు చెన్నయ్య రూ. 2,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని దోమ తహశీల్దార్ కార్యాలయానికి తరలించి విచారించగా, లంచం అడిగినట్లు జీపీఓ ఒప్పుకున్నాడు.అతనిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలిస్తున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రేంజ్ డిఎస్పి ఆనంద్ తెలిపారు