
జనం న్యూస్ జూన్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సీనియర్ రాజకీయ నాయకులు సూరిశెట్టి రమణ అప్పారావు మనుమడు సూరిశెట్టి వెంకట సాయి రిషిక్ 2026 జేఈఈ అడ్వాన్స్ లో ఓబిసి 2003 ర్యాంకుతో ఐఐటీలో సీటు సంపాదించాడు. సాయిరిషిక్ స్టీల్ ప్లాంట్ లో ఉన్న డిఫాల్స్కూల్ లో 10 వతరగతి వరకు ప్రధమశ్రేణి లో పాసవుతూ,ఇంటర్ వేంకటేశ్వర, విశాఖ లో 972/1000 మార్కులుతో,నేడు ఐఐటీ లో సీటు సాధించడం గమనార్హం. రిషిక్ తండ్రి రమణ కుమార్ పాలిటెక్నిక్ లో మేథ్స్ లెక్చరర్ కాగా, తల్లి ఉమాదేవి వ్యవసాయ అధికారిగా పని చేస్తున్నారు. జెఈఈ మెయిన్స్ 15 లక్షలు మంది వ్రాయగా, 2003 ర్యాంకు తో మామనుమడు ఐఐటీ సీటు సాధించటం క్రమశిక్షణ, మరియు కష్టానికి తగిన ఫలితం అని రమణ అప్పారావు తెలిపారు