
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం23-07-2026 మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండకు చెందిన తొగుజాదవ్ (టీచర్) కుమారుడు శ్రీవర్ధన్ జాదవ్ ఐఐటీ మద్రాస్ (చెన్నయ్) యూనివర్సిటీలో సిటు పొందిన చదువుతున్న సందర్భంగా విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,ఈ సందర్భంగా వై.నరోత్తం గారు మాట్లాడుతూ అన్నిటికీ మూలం విద్యనే అని విద్యార్థి మరింత బాగా చదివి ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆకాంక్షిసిస్తూ నియోజకవర్గానికి రాస్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో శివకుమార్, యస్.గోపాల్,యం.మల్లే శం,చెంగల్ జైపాల్,యం. డి.సలీమ్,విద్యార్థి తల్లి దండ్రులు జయశ్రీ తొగు జాదవ్,ఆరుష్ జాదవ్, తదితరులు ఉన్నారు