
జనం న్యూస్ 06 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ప్రజాయుద్ధనౌక గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఐజ మండల ప్రజా సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆంజనేయులు అధ్యక్షతన మహనీయుల విగ్రహానికి అలాగే చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి వక్తలు మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ తొలి దేశ పోరాటం నుంచి మెడ దేశ పోరాటం వరకు ఆయన చేసిన పోరాటాల గురించి ఆయన ఆలోచన విధానాన్ని ఆశయాలను మన వారసత్వానికి పంచాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ప్రజా యుద్ధం నౌక గద్దర్ ఆటపాటలను తెలంగాణ పోరాటంలో ఆయన పాత్రను యువకులు ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను ఎదిరించాల్సిన అవసరం ఉంది తమ సమాజం కొరకు పాటుపడాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్ ఎంఈఓ రాములు నాగరదొడ్డి వెంకట రాములు విజయభాస్కర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మధు కుమార్ అంజి బాబు మిట్టదొడ్డి నరసింహులు ఉప్పల దేవన్న, మొరుగు వీరేశ్ అశ్వ మారెప్ప అశ్వ పెద్దయ్య, బహుజన రాజ్యసమితి నాయకులు,వినోద్ మరియు ఐజ మండలంలోని ప్రజలు ప్రజాసంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు
