
జనం న్యూస్ 12 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : దర్జా గా ప్లాట్ల రాళ్లుపాతిన కబ్జా దారులు ఐజ పట్టణ పరిధిలో గల సర్వే నెంబర్ 688 పై బాగాన ఉన్నా పెద్ద వాగు కబ్జా గురైంది తద్వారా ఏదైనా వరద విపత్తు ఏర్పడితే దాని పక్కనే ఉత్తరం దిక్కున ఉన్నా మా యొక్క యస్ సి కాలానికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టిఇట్టి విషయం పై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని వారం రోజుల క్రితం మండల తహసీల్దార్ కు& మరియు మున్సిపాలిటీ కమిషనర్ ర్లకు పిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొక పోవడం శోచనీయం అలాగే పెద్ద వాగును కబ్జా చేసి, అక్రమంగా వేసిన ప్లాట్లు ను ఇప్పటి వరకు తొలగించడం లేదుకావున గౌరవ జిల్లా కలెక్టర్ తమరు ఇట్టి విషయం పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వి. రాజు మాదిగ ఐజ యం యస్ పి యం ఆర్ పి యస్ జోగులాంబ గద్వాల జిల్లా