
జనం న్యూస్ 05 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ తొలిదశ, పోరాట యోధులు మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి మరియు ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని రేపు తేది 06-08-2026 ఉదయం 10 గంటలకు కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఐజ మండల కేంద్రంలో యం ఆర్ సి భవనం దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలతో జయంతి తరువాత ప్రజా యుద్ధనౌక గద్దర్ ని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులు అర్పిద్దాం.ఈ రెండు కార్యక్రమాలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుప బడును. కనుక ప్రజలు ప్రజాస్వామిక వాదులు తెలంగాణ తొలి దశ మలిదశ పోరాట యోధులు సామాజిక ఉద్యమకారులు కుల సంఘ నాయకులు, వివిధ ప్రజా సంఘ నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం