
*జనం న్యూస్ 24-08-2026 డిస్టిక్ ఆటో సమస్య తీర్చడానికి మీకు మరో మార్గం కనబడలేదా - ఈ విషయం మీద మాలాంటి వాళ్లతో మాట్లాడాలని కూడా మీకు అనిపించలేదావెంటనే డిస్ట్రిక్ ఆటో సమస్య మీద ఆటో యూనియన్ సంఘాలు ఏవైతే ఉన్నాయో పునర్ ఆలోచన చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా పరిష్కారం వెతకండి.అంతేకానీ ఒక డ్రైవర్ ప్రాణం కాపాడడానికి,మరో డ్రైవర్ ప్రాణం తీయకండిఉదా. ఒకటి రెండు సమస్యలు చెప్తా వినండిరంగారెడ్డి సంగారెడ్డి మెదక్ మేడ్చల్ ఇలాంటి జిల్లాల నుండి హైదరాబాదులో ఉన్న అపోలో గాంధీ నిమ్స్ హాస్పటల్ లాంటిది ఎమర్జెన్సీ కేసులు రాత్రనకా పగలనకా తీసుకపోవాల్సి వస్తుంది మరి ఆ పేషెంట్లను తీసుకపోవడానికి సమయానికి బస్సు రాదు అంబులెన్స్ రాదు. ఎమర్జెన్సీగా ఆటోనే వెళ్తది. ఆ ప్రాంతా హాస్పిటల్ కి తీసుకెళ్లి వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది.ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఎమర్జెన్సీ సర్వీసులు ఆటో ఇస్తున్నది. మరి దీనికి విరుద్ధంగా మీరు తీర్మానం చేసినట్లు మాకు తెలిసింది. ఒక సమస్య పరిష్కారం చేయడానికి మరో సమస్యను సృష్టించొద్దు. ఇద్దరికి న్యాయం జరిగే విధంగా చూడాలి అదే పెద్ద మనుషుల లక్షణం.ఈ విషయం మీద మీరు పునర్ ఆలోచన చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా చూడండని పటాన్చెరు లోని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే దస్తగిరి (చోటు) మాట్లాడుతూ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగుడాల సాయిలు, ఎండి ఖాదర్, జార్జ్, రఫీ,రామస్వామి, రమేష్, రాజు, నాయక్, నర్సింలు, సురేష్ తదితరులు ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు