
ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుంది : బండి రమేష్
జనం న్యూస్ జూన్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బండి రమేష్ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ శిబిరం మంగళవారం కూకట్పల్లి వై జంక్షన్‌లోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సతీష్ సావంత్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్, తెలంగాణ బ్రాహ్మణ సంఘం వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, పటోళ్ల నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పా రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై బూత్ లెవల్ ఏజెంట్లకు పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతా యుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి అర్హుడైన వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్లపై ఉందన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరం ద్వారా బూత్ లెవల్ ఏజెంట్లు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.రానున్న కార్పొరేషన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బూత్ స్థాయి నుంచే బలమైన పునాదులు వేయాలని, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని బండి రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మైనారిటీ, ఎస్సీ సెల్, బీసీ సెల్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు