
భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి-ఇస్లావత్ బాలాజీ నాయక్
జనం న్యూస్ -జులై 29- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఎస్ ఐ ఆర్ నమోదు ప్రక్రియ వివరాలను భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బాలాజీ నాయక్ బుధవారం రోజు భారతీయ జనతా పార్టీ బిఎల్ఎ లతో కలిసి పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియలో నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్క ఓటరు ఓటును నమోదు అయ్యేవిధంగా చూడాలని బిఎల్ఏలకు సూచించారు, నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని బిఎల్ఏలతో ఆయన సమావేశం నిర్వహించి ప్రతి ఒక్క ఓటును నమోదు అయ్యేవిధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కొమ్మురాందాస్, గణేష్ తంగరాజు, మూడవత విక్రం నాయక్, సుమ, వావనగిరి జయమ్మ, బండారు విజయ్, సరిత తదితరులు పాల్గొన్నారు.