
జనం న్యూస్ జూలై 18, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం,పూడూర్ మండలం లోని కంకల్ రోడ్డు లోమేము పడుతున్న బాధల్ని కళ్ళారా చూడాలని మేము వేడుకుంటున్నాము తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పరిగి లోని సుల్తాన్పూర్ లో R&Bరోడ్ల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని కొన్ని R&B రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి.కొన్ని రోడ్లకు పనులు ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు పూర్తిగాకపోవడానికి కారణం కూడా చెప్పాలి. ఈ రోడ్లు బాగా లేక పోవడానికి కారణంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి, వికలాంగులుగా మారి, గాయాలపై గాయాలైన వారు చాలామంది ఉన్నారు. ఇంతవరకు పనులు ప్రారంభమైన రోడ్లు ఇంకా పూర్తి కాలేదు. మొదట ప్రారంభించిన పనులు అయితే పూర్తి చేసిన తర్వాతనే ఇతర రోడ్ల భూమి పూజ కార్యక్రమాలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకోలేదు. ఇలా భూమి పూజలు చేసి వదిలేస్తే ఎలా అని అన్నారు. లాల్పహాడ్ నుంచి కంకల్ నుండి చిట్టంపల్లి గ్రామం, మిగితా R&B రోడ్లు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఖచ్చితంగా చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఐటీ ఇంచార్జ్ రవీందర్ కంకల్ , మన్ కీ బాత్ జిల్లా కోకన్వీనర్ కన్నయ్యొల్ల రాజు , కండ్లపల్లి శివరాజ్ , శ్రీనివాస్ చారి , నర్సింలు , మల్లేశం తదితరులు పాల్గొనడం జరిగింది.