
బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సిరి సముందర్ గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ సౌజన్యంతో కంది పంటలు మగ్గతుంచే విధానంపై రైతులకు క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, మాల్తుమ్మెద శాస్త్రవేత్త రేవంత్ గారు రైతులకు కంది పంటలో కొన మొగ్గ తుంచడం వల్ల కొమ్మలు పెరిగి తద్వారా పూత మరియు కాయల సంఖ్య పెరిగి, తద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని సూచించడం జరిగింది. అదేవిధంగా మొగ్గ తుంచే విధానం పాటించడం వల్ల మొక్కల ఎత్తు తక్కువగా పెరిగి పురుగుమందుల పిచికారి సులభతరం అవుతుందని రైతులకు సూచించారు. అనంతరం గ్రామంలోని సోయాబీన్ మరియు కంది పంటలను పరిశీలించి రైతులకు సోయాబీన్ పంటలో కాండం తొలిచే పురుగు మరియు కంది పంటలో మారుక మచ్చల పురుగు నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, మాల్తుమ్మెద శాస్త్రవేత్త రేవంత్ గారు, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి దయానంద్ మరియు రైతులు పాల్గొన్నారు.