
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జూలై. 01. 07. 2026 ఎలక్ట్రిక్ బస్సులు సురక్షితమేనా? ప్రయాణికుల్లో మొదలైన ఆందోళన..!15 రోజుల వ్యవధిలోనే రెండు ఎలక్ట్రిక్ బస్సులు ప్రమాదానికి గురికావడంపై సర్వత్రా చర్చ..!కరీంనగర్-2 డిపోలో ప్రమాదం.. ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..!డిపోలో పార్క్ చేసి ఉన్న TG 02T 1741 నంబర్ గల ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం..!బ్యాటరీ అసెంబ్లీలో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా..!మంటలు అంటుకోవడంతో డిపోలో ఒక్కసారిగా చెలరేగిన తీవ్ర కలకలం..!అప్రమత్తమై మంటలను అదుపు చేసిన డిపో సిబ్బంది.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..!ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న జనం..!వరుస ప్రమాదాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల భద్రతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు..!ఈవీ బస్సుల బ్యాటరీల నాణ్యత, నిర్వహణపై తక్షణమే సమీక్ష జరపాలని ప్రజాసంఘాల డిమాండ్..ఆర్టీసీ అధికారులు స్పందించి ఎలక్ట్రిక్ బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్న ప్రయాణికులు..