
జనం న్యూస్ ఆగస్టు 17, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు పరిగి పట్టణంలోని బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందనిహైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని అన్నారు.రూ. 51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచారని తెలిపారు.కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేరఆర్థిక సహాయం అందిదన్నారు.కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తుచేశారుఅయితే ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసే ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్హులైన లబ్ధిదారులే చెబుతున్నారని అన్నారు.పెళ్లిళ్లు జరిగిచాలా కాలం గడిచినా, కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని
చాలా కాలం తర్వాత ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించిన చెక్కులు కూడా పూర్తిస్థాయిలో పంపిణీ కాకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు.పెండింగ్లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కల్యాణ లక్ష్మి అంశం హైకోర్టుపరిధిలోఉన్న సమయంలో సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని అన్నారు.కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు సర్పంచులు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.