
పేద కుటుంబాలకు సుమారు 22 వేల కోట్లు బకాయి పడ్డ ప్రభుత్వం*ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం.
పేద కుటుంబాలకు న్యాయం చేయాలి – పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి. వీరేశం జూన్. 26. 06. 2026 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సహాయంతో పాటు ప్రతి అర్హులైన వధువుకు తులం (10 గ్రాములు) బంగారం కూడా అందజేస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలు చేయకుండ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడం సరైంది కాదు.
డిసెంబర్ 2023 నుండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. ప్రస్తుతం ఒక్క తులం బంగారం ధర ప్రకారం. ఈ హామీని అమలు చేయడానికి సుమారు 22 వేల కోట్లు అవుతుంది.రాష్ట్రవ్యాప్తంగా *సుమారు 50,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అంచనా *, కేవలం పెండింగ్ నగదు సహాయానికే *సుమారు ₹500 కోట్లకు పైగా, అదే తులం బంగారం హామీని కలిపితే *మొత్తం సుమారు ₹1,225 కోట్ల వరకు అవుతుంది.జహీరాబాద్ నియోజకవర్గ పరిస్థితికి వస్తే సుమారు 5,000 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటికి:.తులం బంగారం (ప్రస్తుత ధర ప్రకారం): *సుమారు ₹72.50 కోట్లు అవుతుంది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి-షాది ముబారక్ లబ్ధిదారులకు తాము ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే లబ్ది పొందిన లబ్ధిదారులకు,కొత్త లబ్ధిదారులకు తులం,(10 గ్రాముల)బంగారం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలిని డిమాండ్ పేద కుటుంబాల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వం మాటలు కాదు, వెంటనే చర్యలు తీసుకోవాలి.