
జనం న్యూస్ ఆగస్టు 4 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో రూ.20 లక్షల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న వారికి భరోసా కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఏరుపల్లి గ్రామానికి చెందిన చరణ్ తేజ పవన్ (14) అరుదైన రక్త సంబంధిత వ్యాధి అయిన ఫ్యాన్కోనీ అనీమియా (Fanconi Anemia) తో బాధపడుతుండగా, అతని ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా అవసరమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సకు మంత్రి సుభాష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.చరణ్ తేజ తండ్రి రాంబాబు నిరుపేద కుటుంబానికి చెందినవారు. సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్వహించనున్న ఈ చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఈ శస్త్రచికిత్స జరగనుంది. ఇప్పటికే దాత నుంచి బోన్ మ్యారో సేకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ బాలుడి తల్లిదండ్రులు తనను కలిసి పరిస్థితి వివరించిన వెంటనే అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉండటంతో, వివిధ దాతలు, సేవా సంస్థలను సంప్రదించి సహాయ సహకారాలు అందేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో సహారా హెల్త్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ తన ASIDAR కార్యక్రమం ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ మఠం, ప్రాజెక్ట్ డైరెక్టర్ హిరణ్మయి, ప్రాజెక్ట్ మేనేజర్ సాహిత్ గౌడ్ తాడూరిలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి బాలుడి చికిత్సకు చేయూతనిచ్చారని మంత్రి సుభాష్ అభినందించారు.అదేవిధంగా చికిత్స నిర్వహణలో భాగస్వాములైన రావి శ్రీనివాసరావు (COO), జి. హరికృష్ణ ప్రసాద్ (జీఎం ఆపరేషన్స్) డాక్టర్ హారిత కొడాలి (హెచ్ఓడీ, మెడికో సోషల్ వర్క్ విభాగం)తో పాటు బసవతారకం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, యాజమాన్యానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే వారం జరగనున్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స విజయవంతం కావాలని, చరణ్ తేజ పవన్ పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి సుభాష్ పేర్కొన్నారు.అలాగే క్యాన్సర్, కాలేయ వ్యాధులు మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలవాలనే లక్ష్యంతో సహారా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు అక్టోబర్ 4న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న "రన్ ఫర్ చైల్డ్ హెల్త్" కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని చిన్నారుల ఆరోగ్య రక్షణకు తమ వంతు సహకారం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం, సేవా సంస్థలు, దాతలు కలిసి పనిచేసినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.