
జనం న్యూస్ ఆగస్టు 05: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజా పూర్ణనందం మాట్లాడుతూ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. బీఆర్ఎస్ హయాంలోనే మెండోరా, ఏర్గట్ల మండలాల్లో 80–90 శాతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై నిరాధార విమర్శలు చేస్తోందని విమర్శించారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నెల రోజుల్లోగా నిజమైన పేదలకు పంపిణీ చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.