

పయనించే సూర్యుడుD.22.06.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ :ఈరోజు సోమవారం రోజున కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మొన్నటి రోజు ఈ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఈ గ్రామం మహిళా సంఘాలకు సంబంధించిన మహిళలందరూ మహిళా సంఘ భవనం గురించి కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది అని తెలియజేశారు.ప్రతిదీ ప్రభుత్వం పై ఆధారపడకుండా మన వల్ల చేయగలిగిన పని కాబట్టి శ్రమదానంతో మంచి స్థలంగా తీర్చి వారికి కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా చేద్దామని అనుకొని ఈ శ్రమదాన కార్యక్రమం చేయడం జరిగింది
వర్షాకాలంలో కాంపౌండ్ వాల్ లోతుగా ఉండడం ద్వారా నీరు నిలవడంతో చెరువుగా మారుతుందని దానితోపాటు నీటి వల్ల మహిళా భవనం లోకి వెళ్లడం రావడం ఇబ్బందిగా మారిందని నీటి నిల్వ వల్ల పాములు తేళ్లు కూడా రావడంతో ఉపయోగించడానికి కష్టంగా ఉందని తెలియజేయడంతోని ఈరోజు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల శాఖ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో కాంగ్రెస్ పార్టీ నాయకుల ట్రాక్టర్స్ ఉపయోగించి శ్రమదానం చేసి ఆ గుంతలు పూడ్చడంతో పాటు గ్రౌండ్ లెవెల్ చేయడం మరియు భవనానికి రంగులు వేయించి ఉండడానికి అణువుగా చేసి ఇవ్వడం జరిగింది ఇకముందు కూడా అమీర్ నగర్ మహిళా సంఘ భవనాలకు ఎలాంటి సమస్యలు ఉన్న మునుముందు ఉండి తీర్చడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశారు ఈ సందర్భంగా అమీర్ నగర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ కమిటీ సభ్యులకు మహిళా సంఘ సభ్యులందరికీ ప్రతి దానికి గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనం కొన్ని చేసుకోవచ్చని రుజువు చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొనగిరి భాస్కర్ మాజీ అధ్యక్షుడు సుంకెట్ రవి మండల కిషన్ కేత్ అధ్యక్షు పడిగెల ప్రవీణ్ AMC డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్ జిల్లా నాయకులు తిప్పి రెడ్డి శ్రీనివాస్ అమీర్ నగర్ సర్పంచ్ వూరే నీలవేణి దశరథ్ కుకునూరు సర్పంచ్ భూమారెడ్డి ఇనాయత్నగర్ సర్పంచ్ భానవత్ రాములు ఉపసర్పంచ్ అనిల్ కుంట ఆనంద్ గ్రామ శాఖ అధ్యక్షుడు కందరి భూమా రెడ్డి క్యాతం గంగా రెడ్డి పుప్పాల నర్సయ్య కానురి లింబాద్రి రాజుల రమేష్ శ్రవణ్ కె రాజేశ్వర మానాల శ్రీనివాస్ క్యాతం గంగారాం రాజుల భీమ్రాజ్ పుప్పాల లక్ష్మీ నర్సయ్య మరియు డ్వాక్రా మహిళల లు పాల్గొన్నారు…