
బిచ్కుంద జూలై 23 ( జనం న్యూస్):ఏఐసీసీ, టీపీసీసీ మరియు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిలుపు మేరకు, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అరెస్టులను ఖండిస్తూ, అలాగే నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, బిచ్కుంద మండల కేంద్రంలోని గాంధీ చౌక్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బిచ్కుంద మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు మున్సిపల్ చైర్మన్ సీమ సెట్ కార్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగనాథ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు.ఈ నిరసన కార్యక్రమంలో బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ శంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి పటేల్ బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త ప్రేమ్ సెట్ కౌన్సిలర్ నౌషా నాయక్ మారుతి పటేల్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రవి పటేల్ కాంగ్రెస్ నాయకుడు సీమ గంగారాం మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.