
జనం న్యూస్ ఆగస్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన ఆయన రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం ఆయన జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ స్వరాష్ట్రమని తెలిపిన మహనీయుడు అని అన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజాభివృద్ధి, ప్రజాసేవ, కర్తవ్యనిర్వహణలో ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో. సర్పంచులు సతీష్ ప్రభాకర్ కుమారస్వామి కాంగ్రెస్ నాయకులు మారేపల్లి రవీందర్ చిందం రవి దుబాస్ కృష్ణమూర్తి మంద ప్రభాకర్ వైనాల కుమారస్వామి శానం కుమారస్వామి రాజు ఐడి చంద్రమౌళి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు….