
420 మోసాల యొక్క భారీ బ్యానర్ ప్రదర్శన
ప్రజా సమస్యలపై పోరాటం.. ప్రజల పక్షాన బీఆర్ఎస్ :ఎమ్మెల్యే మాణిక్ రావు గారు
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా. ఇంచార్జ్బి. వీరేశం సెప్టెంబర్ 2. 09. 2026 పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజలను మోసం చేసిన తీరును నిరసిస్తూ బుధవారం భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, మాజి డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్యే గారు విమర్శించారు.బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలోమాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు, తంజిం,సీనియర్ నాయకులు నామా రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, జహీరాబాద్ & కోహీర్ కౌన్సిలర్ లు,బొగ్గుల సంగమేశ్వర్,నరసింహ రెడ్డి, సురేష్, ఖళీమ్ ,పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు