
జనం న్యూస్ 3 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండీ జహంగీర్ ఆలేరు పట్టణంలో గురువారం రోజున విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 5న ఆలేరులో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను విస్మరిస్తోందని విమర్శిస్తూ, సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తామని నాయకులు పేర్కొన్నారు. పాల్గొన్నవారు మండల పట్టణ టిఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు