
బీఆర్ఎస్ 420 అడుగుల ఫ్లెక్సీతో నిరాసన
జనం న్యూస్ 3 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున బి ఆర్ ఎస్ నియోజకవర్గ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ 420 అడుగుల ఫ్లెక్సీని ప్రదర్శించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి, నియోజకవర్గంలోని వివిధ విభాగాల బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.