
జుక్కల్ సెప్టెంబర్ 03 జనం న్యూస్కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా BRS పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్ర BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలో రెండవ రోజు రైతు సదస్సు కార్యక్రమాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, పంటల సాగుకు అవసరమైన నీటి కొరత, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు తెలిపారు.గతంలో కెసిఆర్ ప్రభుత్వం హయాంలో రైతులకు రైతుబంధు, సాగునీరు, వ్యవసాయానికి ప్రోత్సాహం వంటి పథకాలతో రైతులు ధైర్యంగా పంటలు పండించేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని రైతులు పేర్కొన్నారు.రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ఇచ్చిన హామీలను అమలు చేయాలి..రైతులకు న్యాయం చేయాలి..అంటూ రైతు సదస్సులో నినదించారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
