
జుక్కల్ ఆగస్టు 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి తండా లో నూతనంగా రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని సోమవారం ప్రజావాణి లోఎండీఓ అభినవ్ గారికి కాటేపల్లి తండా ప్రజలు వినతిపత్రం సమర్పించారు.ప్రస్తుతం రేషన్ షాప్ కాటేపల్లి గ్రామంలో ఉందని తెలిపారు.రేషన్ సరుకులు తీసుకోవడానికి కాటేపల్లి తండా నుండి కాటేపల్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తుందని తండా ప్రజలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్,మాజీ ఎంపీటీసీ మొగలా గౌడ్, పాండు నాయక్, భార్త్యా నాయక్,కాటేపల్లి తండా ప్రజలు తెలిపారు.