
జనం న్యూస్ జూలై 2 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోనడాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శిలా విగ్రహ ప్రతిష్ట, గణపతి, ఆంజనేయ శిలా విగ్రహం, ఆలయ శిఖరం, జీవ ధ్వజస్తంభం, గరుడ బలిపీఠ పునర్ ప్రతిష్ట మహోత్సవం వేద మంత్రాల నడుమ వైభవంగా జరిగింది.ఈ మహోత్సవ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు, మాజీ జడ్పీటీసీ నాగిడి నాగేశ్వరావు, ఆకాశం శ్రీనివాసరావు, రంబాల చిట్టిబాబు, బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ రంబాల సూరిబాబు, రంబాల రాంబాబు, బొలిశెట్టి ఏసుబాబు, బొలిశెట్టి జగదీష్ కుమార్, బొలిశెట్టి పెదబాబులు, బొలిశెట్టి చినబాబులు, బోలిశెట్టి బాబీ, నామన కిరణ్, నామన శ్రీనివాస్, బోలిశెట్టి అఖిల్ తదితరులు హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందారు.ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూర్ణాహుతి అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.