
జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ యోగ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ మల్లెపూల వెంకటరమణ నిర్వహించిన కళావైభవ మహోత్సవ పురస్కార వేడుకల్లో కాట్రేనికోనకు చెందిన కళాకారులు పుష్ప సురేష్ శర్మ, వట్టూరి కామేశ్వరావులకు చిక్కడపల్లి త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో కళా వేంకట దీక్షితులు వేదికపై స్వర్ణ నంది అవార్డులు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎంతో మంది కళాకారులకు వారధిగా, రథసారధిగా ఉంటూ సన్మాన సత్కారాలతో పాటు స్వర్ణ, రజిత నందిలను అందిస్తూ కళాకారుల కోసం అనునిత్యం అనేక కార్యక్రమాలను చేపడుతున్న మల్లెపూల వెంకటరమణను పలువురు కొనియాడుతూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ అవార్డులు అందజేస్తూ ఆశీస్సులు తెలిపారు. సినీ నటుడు కె.వి.ఎల్ నరసింహారావు, డైరెక్టర్ రమేష్ ఉప్పు, జూనియర్ ఎన్.టి.ఆర్ కోటగిరి చంద్రశేఖర్, డాక్టర్ కీరసాగర్ దంపతులు పాల్గొన్నారు.