
జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన :
కాట్రేనికోన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నూతన ఎరువుల విక్రయాలను ఈరోజు ప్రారంభించారు. మొదటి విడతగా యూరియా అమ్మకాలను సంఘ అధ్యక్షులు పెసింగి రంగారావు వర్మ ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంటాయని అధ్యక్షులు తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సంఘం ద్వారా సబ్సిడీ రేటుకే ఎరువులు అందిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు చేకూరి వెంకట కృష్ణంరాజు, మోకా అప్పాజీ, నీటి సంఘ అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు, ఓలేటి భూషణం, రైతులు పితాని రమేష్, దొమ్మేటి నాగేశ్వరావు, పంతాడి గణేష్ రాజశేఖర్, సానబోయిన వెంకటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మనోజ్, సుధ, సంఘ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు.రైతులు ఎరువుల కోసం సంఘ కార్యాలయానికి రావాలని, ఎవరికీ బ్లాక్ మార్కెట్ ద్వారా కొనే అవసరం ఉండదని అధ్యక్షులు హామీ ఇచ్చారు.