
జనం న్యూస్ మే 20 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ప్రకృతి వ్యవసాయం వాళ్ళు అందిస్తున్న నవధాన్యాలు సాగులో 5 కేజీల బ్యాగ్ లో 28 రకాల విత్తనాలు ఉంటాయి..ఇది అర ఎకరానికి వస్తుంది..5 కేజీల ధర - 500 /-ఇవి కొబ్బరి తోట మరియు వరి పొలములో వేసుకోవచ్చు.. మినుము,పెసలు,కందులు,రాగులు ,జొన్నలు ,సజ్జలు, తోటకూర, గోoగుర,ఉలవలు,పిల్లిపేసర ఇంకా చాలా రకాల విత్తనాలు ఉన్నాయి..వరి కోతకు 10 రోజుల ముందు లేదా కోతలు అనంతరం ( కోసిన తరువాత) భూమి సమాయిoపు చూసుకుని వేసుకోవాలి .ఒకవేళ భూమి చమ్మ లేకపోతే విత్తనాలు రాత్రంతా నానబెట్టి ఆ మరుసటి రోజు ఉదయం నీటిలో నుండి విత్తనాలు తీసి సంచిలో మూటకొట్టి సాయంత్రం 4 గంటలకు చల్లుకోవాలి..ఇలా విత్తనాలు మొలక వచ్చి మొక్కలు ఎదిగిన తరువాత పంట వుంచుకోవచ్చు..లేదా పొలములో కలియ దున్ను కోవచ్చు..లేదా ఆ రొట్టను కోసి పశువులు కు వేసిన పాలు సంవృద్ధి గా ఇస్తాయి..అలాగే కలుపు నివారణ తగ్గుదల, దిగుబడి పెరుగుదల,రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుంది..ముఖ్యముగా నేల లో సేoద్రియ కర్బనం శాతం పెరుగుతుంది..నత్రజని ప్రభావo పెరుగుతుంది..ఇది వేయడం వలన యూరియా వినియోగo తగ్గుతుంది..కావున రైతులు ఎవరికైనా కావాలి అంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన రైతుసేవ కేంద్రం లో ఉన్నాయి..ప్రతి రైతు సేవ కేంద్రం లో -ప్లేస్ లో ప్రకృతి వ్యవసాయం స్టాఫ్ వారు అందుబాటులో ఉంచారు అని మండల వ్యవసాయాదికారి వారు బి. మృదుల గారు చెప్పడం జరిగింది.. -ప్లేస్ లో ప్రకృతి వ్యవసాయం స్టాఫ్ ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుంది అని ..కాట్రేని కోన గ్రామములో కావలిసిన రైతులు అరుణ కుమారి ప్రకృతి వ్యవసాయం --9603538795 వివరాలకు ఈ ఫోన్ నెంబర్ సంప్రదించవచ్చు