
జనం న్యూస్ 07 మే వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా :- కార్పోరేట్ కళాశాలల పథకం క్రింద ప్రైవేట్ జూనియర్ కళాశాలలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీ యం . జయపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆసక్తి గల ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సంబoదిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పేరుపొందిన జూనియర్ కళాశాలలను జిల్లా ఎంపీక కమిటీ షార్ట్ లిస్ట్ తయారు చేస్తుందన్నారు. అన్ని ప్రాథమిక సౌకర్యాలతో సరిపోయేంత మంచి వసతి. EAMCET లాంటి ప్రవేశ పరీక్షలో ఏకరితిలో అధిక ఉత్తీర్ణత నియమావళి ప్రకారం ఉండాలని ఆయన తెలిపారు.పూర్తి వివరాలను www.epass.cgg.gov.in వెబ్ సైట్ ని సందర్శించాలని ఆయన కోరారు. కళాశాల రిజిస్ట్రేషన్ కు చివరి తేది 11-05 -2026 . పూర్తి సమాచారం కొరకు 9573859268 సంప్రదించగలరు.