
జనం న్యూస్ జులై 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సంఘం తమను ఆదరించి గెలిపిస్తే చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని చైర్మన్ అభ్యర్థి సామల రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా సామల రవీందర్ చైర్మన్ అభ్యర్థిగా తన ప్యానల్ డైరెక్టర్ అభ్యర్థులతో మంగళవారం ఓటర్లను కలిసి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికుల సమస్యలు తమకు తెలుసని, వారి కష్టాలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంఘ అభివృద్ధికి నిరంతరం చెమటోడ్చి పనిచేస్తానని తెలిపారు తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తనతోపాటు తన ప్యానల్ లోని డైరెక్టర్ అభ్యర్థులు దాసరి సమ్మయ్య కొబ్బరికాయ గుర్తు, పసునూటి రమణయ్య కప్పు సాసర్ గుర్తు, పూల ఐలుమల్లు డీజిల్ పంపు, బాసాని బాలకృష్ణ గ్యాస్ సిలిండర్, బాసాని విద్యాసాగర్ గ్యాస్ పొయ్యి, మామిడి భరత్ కుమార్ కుండ గుర్తు, గోరంట్ల కమల బీరువా, బాసాని ఉమా బ్యాట్ గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఓటర్ల నుంచి సానుకూల స్పందన రావడంతో తమ ప్యానెల్ గెలుపు ఖాయం అయిందని ఈ సందర్భంగా సామల రవీందర్ అన్నారు. నిరంతరం కష్టపడి పని చేసే వారిని గుర్తించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా రవీందర్ తెలియజేశారు ఈ ప్రచారంలో డైరెక్టర్ అభ్యర్థులు సమ్మయ్య, ఐలుమల్లు, భరత్ కుమార్, విద్యాసాగర్, రమణయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు….