
జనం న్యూస్ జూలై 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కుక్కింద గ్రామంలో రిటైర్డ్ ఎస్ఐ కారంజి సంగమేష్ సతీమణి కీర్తిశేషులు కరుణ దినకర్మ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు, సీనియర్ జర్నలిస్టు తెల్ల హరికృష్ణ హాజరై కీర్తిశేషులు కరుణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రవి, శివతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కరుణ సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడింది.