
జనం న్యూస్ ఆగస్టు 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ శివాజీనగర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ గౌడ్ సారథ్యంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమం టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమని బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని బండి రమేష్ కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్,యన్ యస్ య ఐ నాయకులు, మైనారిటీ నాయకులు, యస్ సి సెల్ నాయకులు, బి సి సెల్ నాయకులు, సేవాదళ్ నాయకులు, సోషల్ మీడియా,కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది.