
జనం న్యూస్ ఆగస్టు 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పిందని చంద్రబాబు పాలనలో యువతకు ఉద్యోగాలే ఉద్యోగాలు అని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జాబు క్యాలెండర్ ప్రకటనపై హర్షం ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకు వేసిందని, యువతకు ఇది ముమ్మాటికీ ఉద్యోగాలు జాతరని నాగ జగదీష్ అన్నారు. గతంలో మెగాడీఎస్సీ నిర్వహించి 15 వేల 941 మందికి ఉద్యోగాలు కల్పించారని, మరోసారి విద్యా ఐటీ శాఖ నారా లోకేష్ 10,060 పోస్టులు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ 2026 కు గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారని, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రత్యక్ష నియమాక పోస్టులకు నాలుగు విడతల్లో భర్తీ చేయనుందని నాగ జగదీష్ అన్నారు. ప్రజా సమస్యలే అజెండాగా సాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నిరుద్యోగ యువతి యువకులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో 23 లక్షల కోట్లు పెట్టుబడులతో రాష్ట్రమంతా అన్ని జిల్లాలలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే 9 లక్షల కోట్లు పెట్టుబడులను వివిధ జిల్లాల్లో శంకుస్థాపనలో జరిగాయని, కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం జరిగిందని నాగ జగదీష్ అన్నారు. మెగా డీఎస్సీ పై జగనాసురుడు వారు తాపేదారులు చేస్తున్న ఆరోపణలను తిప్పుకొడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారని, మాటతప్పని ధీరత్వంతో, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు నిరంతరము శ్రమిస్తున్న యువ నేత నారా లోకేష్ ప్రజాదారణతో దూసుకుపోతున్నారని, ఈ రాష్ట్రంలో ఉన్న యువతుకు న్యాయం చేయాలని లక్ష్యంగా లోకేష్ పని చేస్తున్నారని నాగ జగదీష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ ధర్మకర్త యలమంచిలి బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.//