
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సోమవారం నందలూరు మండలంలోని షాదీ ఖానాలో తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీభూమి - మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు గా చమ్మర్తి జగన్ మోహన్ రాజు మరియు యల్లటూరి శ్రీనివాస రాజు పాల్గొని మాట్లాడారు.రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ, రీ సర్వే లాంటి పెండింగ్ లో ఉన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం దిశగా నేటి కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడం ఎంతో సంతోషదాయకమని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీని వాసరాజు టీడీపీ రాజంపేట నియోజకవర్గం ఇంచార్జి చమ్మర్తి జగన్ మోహన్ రాజు కొని యాడారు అనంతరం యల్లటూరు శ్రీనివాసరాజు మరియు టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు కలసి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యెద్దల సుబ్బ రాయుడు, మాజీ జడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివ రామరాజు,నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, టిడిపి మండలాధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య, కూటమి నాయకులు పల్లె సుబ్రహ్మణ్యం, జంగంశెట్టి సుబ్రహ్మణ్యం, భూశెట్టి వెంకట సుబ్బయ్య, మాజీ సర్పంచ్ మోడపోతుల రాము, గంధం గంగాధర్, మున్వర్ బాషా , నందలూరు తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో కె.ఆర్.ఎం. ప్రసాద్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.