
జనం న్యూస్ సెప్టెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు మరియు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభ నిర్వహణ, వాహనాల పార్కింగ్, భద్రతాపరమైన స్థలాలను పరిశీలించారు.