
కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు – కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
జనం న్యూస్ సెప్టెంబర్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ స్వామి గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, సంబంధిత వ్యక్తిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బి. చైతన్య యాదవ్, ఎం. అశోక్, ఏ. సంతోష్ యాదవ్, హుడిగి మహేష్, ఎస్. పవన్, రాధారెడ్డి, నర్సింగ్ గౌడ్, శేఖర్, కే. నాగరాజ్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.