
జనం న్యూస్ జూన్ 18 (కాట్రేనికోన) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సీనియర్ పాత్రికేయుడు,విశాలాంధ్ర దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ కొండేపూడి సత్యనారాయణఇటీవల తనువు చాలించిన సంగతి తెలిసిందే. కాట్రేనికోన సచివాలయం వద్ద గురువారం ఆయన సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు పాత్రికేయులు హాజరయ్యారు. సత్య నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.జర్నలిస్టుగా సత్యనారాయణ సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగావీరు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మట్టపర్తి రవి ,అయితా బత్తులశీను బాబు, గోనెమడతల బ్రహ్మాజీ, , కాశి సురేష్, గంటి బోస్, కొంకి రవి, జగడం శ్రీనివాస్,బడుగు శ్రీనివాస్, కాశి చక్రితదితరులు పాల్గొన్నారు.