
జనం న్యూస్ :6 ఆగస్టు గురువారం : సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ :కొమురవెల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) హాస్టల్కు ప్రహరీ గోడ నిర్మించాలని, జిల్లాలోని కేజీబీవీలలో తాగునీటి సౌకర్యం కల్పించాలని, శాశ్వత వాచ్మెన్లను నియమించాలని యూఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుడికందుల రవి మాట్లాడుతూ విద్యార్థినుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వినయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.