
జనం న్యూస్, జులై 21, జగిత్యాల జిల్లా కోరుట్ల: కోరుట్ల ఆర్టీసీ బస్ డిపోకు చెందిన బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేపింది.అందిన సమాచారం మేరకు, కోరుట్ల బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి తీసుకెళ్లి నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఆర్టీసీ అధికారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న కోరుట్ల, మెట్పల్లి పోలీసులు అప్రమత్తమై బస్సును వెంబడించారు. ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ దేవాలయం సమీపంలో బస్సును అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్సును ఎత్తుకెళ్లిన ఉద్దేశ్యం ఏమిటి? నిందితుడి వివరాలు ఏమిటి? అనే అంశాలపై అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.