
జనం న్యూస్ ఆగస్టు 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం, ఖైతలపూర్ డివిజన్ హబీబ్ నగర్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి మోయిజ్, ఖైతలపూర్ డివిజన్ ప్రెసిడెంట్ కలికోట శంకర్ హాజరై మహిళలకు చీరలను అందజేశారు.ఈ సందర్భంగా డివిజన్ ప్రెసిడెంట్ కలికోట శంకర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం మరియు సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రగతి పథంలో మహిళలను ముందుంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల సంక్షేమం, మహిళల గౌరవమని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అక్బర్, ఆరిఫ్, సుల్తాన్, శ్రవణ్, షాకీర్, అహల్లుద్దీన్, జోగ్గా, జహీర్, జావేద్, తబ్రేజ్, అజీజ్, వినోద్, జైనుద్దీన్, రవి, అజయ్, మహిళా నాయకురాలు జోజ్జమ్మ, ఆర్ పి సభ్యులు ఈశ్వరి, విజయలక్ష్మి మరియు ఇతర కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.