
జనం న్యూస్ ఆగస్టు 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఖైత్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీహరి నగర్ కాలనీలో భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఖైత్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలికోట శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి మోయిజ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆ మహానాయకుడి సేవలను స్మరించుకుంటూ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డివిజన్ ప్రెసిడెంట్ కలికోట శంకర్ విలేకరులతో మాట్లాడుతూ…దేశంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టి, నేటి డిజిటల్ రంగానికి దృఢమైన పునాది వేసిన యుగపురుషుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి దేశ రాజకీయాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత, పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణ చేసి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరిఫ్,సలీమ్,సుల్తాన్, అమేర్,రాజేష్ గౌడ్,కర్క పెంటయ్య, తూము మనోజ్, ప్రకాష్ ముదిరాజ్,అక్బర్,చారి,అల్లు,జహీర్, తబ్రేజ్,జంగీర్,శ్రీకాంత్,కిషన్, నరేందర్,శంకర్,కుమార్,వీరన్నలతో పాటు పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.