
జనం న్యూస్ 14 జులై :- వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ బొల్లి పద్మ-రాజు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లి పద్మ-రాజు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా నాణ్యమైన సీసీ రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని అన్ని కాలనీలకు దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.