
జనం న్యూస్ 01 ఆగస్టు వికారాబాద్ జిల్లా :- పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ బొల్లి పద్మ రాజు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి అబ్దుల్లా ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై చర్చించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే గ్రామంలో కొనసాగుతున్న SIR ఓటరు సర్వేలో 100 శాతం డిజిటల్ నమోదు పూర్తయిందని, అర్హులైన వారు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన జల సిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, పొలానికి పంట కుంట, ఊరికి ఊరకుంట ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను సంరక్షించాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశం అనంతరం గ్రామంలో స్తంభాలు ఒరిగి వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించి దాని మూడు వైర్లు ఉండే విధంగా అమర్చినందుకు గాను లైన్మెన్ సతీష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ గ్రామపంచాయతీ తరుపున సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబరు, అంగన్వాడి టీచర్ మనీలా, ఆశ వర్కర్ మంజుల, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.