
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధి లోగల విద్యానగర్ నందు. గత వారం రోజులుగా సక్రమంగా నీళ్లు వదలడం లేదని విద్యానగర్ వాసులు తీవ్రంగా. విమర్శిస్తున్నారు. గత నాలుగు రోజులుగా త్రాగునీరు వాటర్ క్యాన్లతో తో తీసు కొచ్చి నివాసాలలో ఉంచు తున్నామని ఆ ప్రాంత వాసులు తెలిపారు. గతంలో పలుసార్లు సంబం ధిత అధికారులకు వినతి పత్రాలు, చరవాణి ద్వారా సమ స్యల గురించి వివరిం చినా సంబంధిత అధి కారులు పట్టించుకున్న దాఖలను లేవని వారు తెలిపారు. స్థానికులు పంచాయతీ అధికారు లను, స్పెషల్ ఆఫీసర్లను చరవాణి లో సంప్రదించగా ఉదయం 9 గంట ల నుంచి 12 గంటల వరకు నీళ్లు వదులుతామని చేయడం విడ్డూరంగా స్థానికులు. విమర్శిస్తున్నారు. ఆ వీధిలో పలువురు ఉద్యోగులు ,తది తరులు తమ ఉద్యోగరీత్యా ఉదయం 9 గంటలకు విధు లకు వెళ్ళవలసి ఉంది అప్పట్లో నీరు వదిలితే ఎవరు ఇంట్లో ఉండి పట్టు కోవాలో పరిస్థితి కావడం లేదని వారు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.